topnews

రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు విప్ జారీ..

టీడీపీ కూడా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.. సోమవారం ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి టీడీపీ సిద్ధమవుతోంది.. రేపు ఉదయం 10.30కు గుంటూరు పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది.. రాజధాని తరలింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ సభలో ఏయే అంశాలు ప్రస్తావించాలనే దానిపై టీడీఎల్పీలో చర్చ జరగనుంది.. టీడీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్య నేతలతో స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు ఆ […]

కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ కనుమూరి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అయిభీమవరంలోని తన నివాసంలో కోడి పందాలు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తప్పేమీ లేదని, గోదావరి జిల్లాల్లో పండగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పైగా ఎన్నో కోళ్ల జాతుల్ని పరిరక్షించుకునేందుకు ఇదో మంచి అవకాశం అని చెప్పారు. కోడి పందాలతోపాటు, ఎడ్లపందాలు, పొటేలు పందాల్లాంటివి కూడా కాపాడుకోవాలన్నారు. ఏటా సంక్రాంతి సమయంలో […]

శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ్టి నుంచి విచారణ చేపట్టనుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసులు గల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాదాపు 60కి పైగా రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇవాళ్టీ నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ విచారణ చేయనుంది. […]

పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన యువతులు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 10లోని టాట్‌ పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయనే సమాచారంతో… వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు ఎక్సైజ్‌ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ పబ్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అశ్లీల నృత్యాలు చేస్తోన్న యువతులను జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు […]

అమరావతి ఉద్యమం : అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబు

రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ… అమరావతి పరిక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీలు, బహిరంగ సభలు కొనసాగుతున్నాయి. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురంలో పర్యటిస్తారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు ఆయన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య పెనుగొండలో జరిగే బహిరంగ […]

విజయవాడలో ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం

విజయవాడలో ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో 13 జిల్లాల అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై చర్చించనుంది. అటు.. రాజధాని రైతులకు ఏ రకమైన హామీ ఇవ్వాలని, వారికి ఏ రకంగా ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సచివాలయ ఉద్యోగుల ముందు కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఈ […]

నేడు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

దాదాపు మూడున్నర నెలల తరువాత తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కాబోతున్నారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటవెంటనే 3 సార్లు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సమస్యలు, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం పై చర్చించారు. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కూడా ఉమ్మడిగా వెళ్లాలని నిర్ణయించారు. నదుల అనుసంధానం ఉమ్మడిగా చేపట్టాలని తెలంగాణలో ఏదో ఒక చోట […]

టీవీ-5 ఎఫెక్ట్‌తో SVBC ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై వేటు

టీవీ-5 ఎఫెక్ట్‌తో SVBC ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై వేటుపడింది. ఓ మహిళతో ఆయన సాగించిన రాసలీలల ఆడియోటేప్‌ను వెలుగులోకి తెచ్చింది టీవీ-5. శనివారం రాత్రి ఆయనలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను బయటి ప్రపంచానికి తెలియజేసింది. అత్యంత పవిత్రమైన పదవిలో ఉంటూ … తెరచాటుగా పృథ్వి సాగించిన రాసలీలలపై టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ5 బయటపెట్టిన ఆ ఆడియో క్లిప్ పెను సంచలనమే సృష్టించింది. […]

స్పెషల్‌ బస్సులు, ట్రైన్స్‌ అన్నీ ఫుల్‌ రష్‌..

స్కూళ్లకు, ఆఫీసులకు పండగ సెలవులు వచ్చేశాయ్. దీంతో సంక్రాంతి పండగను సెలబ్రేట్‌ చేసుకునేందుకు పల్లెలకు క్యూ కట్టారు జనం. అయితే.. ఎప్పటిలానే ఈసారి కూడా పండుగ కష్టాలు వదలడం లేదు. రైళ్లన్నీ మూడు నెలలు ముందుగానే బుక్కైపోయాయి. స్పెషల్‌ ట్రైన్స్‌ కూడా ఫుల్‌ రష్‌. తత్కాల్‌పై ఆధారపడిన వారికి తిప్పలు తప్పడం లేదు. టికెట్‌ దొరక్క.. రైల్లో సీటు లభించక చుక్కలు చూస్తున్నారు. […]

తుళ్లూరులో తీవ్రమైన పోలీసుల దమనకాండ

రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళన 27వ రోజుకు చేరుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై మూడ్రోజులుగా దౌర్జన్యకాండ సాగిస్తున్నారు పోలీసులు. అరెస్టులు, లాఠీఛార్జ్‌తో బెంబేలెత్తిస్తున్నారు. అయినా ప్రజలు లెక్కచేయడం లేదు. 144 సెక్షన్‌ను కూడా లెక్కచేయకుండా తుళ్లూరు మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాలని బలంగా వినిపిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే ఏకైక డిమాండ్‌తో నినదిస్తున్నారు. కానీ జగన్‌ […]