దిశ.. దిశ.. ఈ పేరు అందరితో కన్నీరు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆమెకు మద్దతుగా జనం ముందుకు కదులుతున్నారు.. అతి దారుణంగా అత్యాచారం చేసి.. తరువాత హత్య చేసిన ఆ నలుగురు నిందితులను ప్రజాక్షేత్రంలో ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తున్నారు.. తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని షూట్‌ చేయాలని దిశ తండ్రి డిమాండ్‌ చేశారు. కూతురి అస్తికలను జోగులాంబ గద్వాల్‌ జిల్లా బీచుపల్లి […]

విజయవాడ పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. 2017 డిసెంబర్‌లో అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరు నుంచి తల్లితో కలసి బాధిత బాలిక ఇబ్రహీంపట్నానికి వచ్చింది. అయితే బాలిక బంధువైన సైకం కృష్ణారావు ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై […]

మెక్సికోలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, మాదకద్రవ్యాల ముఠాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించారు. వీరిలో 13మంది ముఠా సభ్యులు కాగా… ఇద్దరు సాధారణ పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నారు. అమెరికా సరిహద్దుకు 40 మైళ్లదూరంలో విల్లాయూనియన్ పట్టణంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఓ భవనంలో డ్రగ్స్ స్మగ్లర్లు దాగినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికిచేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇరువర్గాల […]

రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన పవన్ కల్యాణ్.. తిరుపతి, చిత్తూరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని జనసైనికులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేశారు జనసేనాని. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారని అయినా వెనకబాటుతనం మాత్రం పోలేదన్నారు. నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయని.. పేదలు మాత్రం పొట్టచేత పట్టుకుని వలస పోతున్నారని ఆరోపించారు. ఓట్ల రాజకీయాలను. జనసేన కేడర్‌ని, […]

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. నల్లమల అడవిలోని గిరిజన గ్రామమైన పాలుట్లలో అన్యమత ప్రచారానికి 19 మంది యువకులు వెళ్లారు. వీరంతా కర్నూలు జిల్లా, రంగాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ 19 మంది యువకుల్ని పాలుట్లలోని గిరిజనులు అడ్డుకున్నారు. అనుమతిలేకుండా అడవిలోకి వెళ్లిన.. అన్యమత ప్రచారకులను అదుపులోకి తీసుకున్నారు గంజివారిపల్లె రేంజ్‌ అటవీశాక అధికారులు.

గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభిస్తూ..సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని..అందుకే తన మతం,కులంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తోందన్న జగన్…తన మతం మానవత్వం…కులం మాట నిలబెట్టుకునే కులమని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతోనే ఈ ఆర్నెల్లు పనిచేశానన్నారు. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావిస్తున్నామని చెప్పారు […]

తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని షూట్‌ చేయాలని దిశ తండ్రి డిమాండ్‌ చేశారు. కూతురి అస్తికలను జోగులాంబ గద్వాల్‌ జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో కలిపిన ఆయన.. నిందితులను నడిరోడ్డుపై కాల్చి చంపినప్పుడే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందన్నారు. బీచుపల్లి కృష్ణానదిలో స్నానం చేసి.. అక్కడి కోదండరాముల వారిని దర్శ చేసుకోవాలి అనుకుంటే.. తన బిడ్డ ఆస్తికలను కలపాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే […]

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన బాట పట్టింది. పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్డీకాపుల్‌లోని రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ దోరణి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచడంతో పాటు ఐదు రూపాయల ఉన్న కనీస టికెట్‌ ధరను పది రూపాయలకు పెంచడం […]

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న బాధితులకు ఆర్ధిక సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి రోజుకు 225 రూపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేలు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో పనిచేస్తున్నామన్నారు సీఎం జగన్‌. మంచి పాలన అందిస్తుంటే.. కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం అన్నారు. తన మతం, […]

APPSC ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లుగా ఉదయ్ భాస్కర్ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు… వెంటనే ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.