తహసీల్దార్‌ విజయారెడ్డి అటెండర్ చంద్రయ్య మృతి

అబ్దుల్లాపూర్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య మృతి చెందాడు. 28 రోజులుగా డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన.. తుది శ్వాస విడిచారు. చంద్రయ్య స్వగ్రామం శంషాబాద్‌ మండలం రాళ్లగూడు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో... Read more »

చంద్రయ్యకు చికిత్స కరువాయె..

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దారు విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్యకు.. అధికారులు, ఆస్పత్రి యాజమాన్యం నరకం చూపిస్తోంది. అపోలో-DRDO ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా.. బిల్లు కట్టడం లేదంటూ వైద్యులు చికిత్సకు నిరాకరిస్తున్నారు. వేరే హాస్పిటల్‌కు వెళ్లండని తేల్చి చెప్తున్నారు. ఆ రోజు చంద్రయ్య ధైర్యాన్ని... Read more »

కాపాడే ప్రయత్నం చేయడమే ఆయన చేసిన తప్పా?

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం అటెండర్‌ చంద్రయ్య పరిస్థితి ధీనంగా మారింది. అతడి పరిస్థితిని అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం వైద్యం నిలిచిపోయింది. ఆస్పత్రి బిల్లు కట్టడం లేదనే కారణంతో చంద్రయ్యను ఆస్పత్రి నుంచి చికిత్స మధ్యలోనే బయటకు తరిమేశారు.... Read more »

విజయారెడ్డి హత్య వ్యవహారంలో సురేష్ వెనుకున్నదెవరు?

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసింది సురేషే అయినా.. దీని వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గౌరెల్లి, బాచారం, బండరావిరాలలోని భూములు దశాబ్దాలుగా వివాదాల్లో ఉండటంతో.. వాటికి పాస్‌బుక్‌లు రాలేదు. ఒకవేళ పాస్‌బుక్ వస్తే ఆ భూములు రియల్ ఎస్టేట్‌... Read more »

తహసీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే పడుతోందంటూ.. బెదిరింపు ఫోన్‌ కాల్‌

తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యోదంతం తర్వాత రెవెన్యూ అధికారులకు బెదిరింపులు పెరిగిపోయాయి. తాజాగా కామారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాడ్వాయికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఫోన్‌ చేసి.. తహసీల్దార్‌ విజయారెడ్డికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. భూవివాదంలో... Read more »

తహసీల్దార్ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు: మంచిరెడ్డి కిషన్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే మల్‌రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హత్యకేసు నిందితుడి సురేశ్‌ కుటుంబ సభ్యుల నుంచి.. మల్‌రెడ్డి కుటుంబ సభ్యులు... Read more »

భగ్గుమన్న రెవెన్యూ ఉద్యోగులు

తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. యాదాద్రి జిల్లా గుండాల MRO కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఓవైపు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా.. VRO లంచం తీసుకుని... Read more »

తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..

తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ.. పరిస్తితి విషమించి మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా గురునాథం శరీరం 70శాతం కాలిపోయింది. దీంతో... Read more »

తనకు ప్రమాదం ఉందని ముందుగానే ఊహించిన ఎమ్మార్వో !

తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆఫీసులోనే ఎమ్మార్వోను తగలబెట్టడం ప్రకంపనలు సృష్టించింది. విజయారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని వాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే సీపీ మహేష్ భగత్, ఘటనా స్థలికి వెళ్లి... Read more »

పట్ట పగలు తహసీల్దార్‌‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో దారుణం జరిగింది. పట్ట పగలు తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో విజయారెడ్డి సజీవదహనం అయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు దుండగుడు కార్యాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్‌ విజయారెడ్డితో మాట్లాడతానని చెప్పి దుండగుడు లోపలకి... Read more »