తెలంగాణలో కాకతీయుల పాలనను స్వర్ణయుగంగా చెబుతారు. కాకతీయుల కీర్తి ప్రతిష్టను నలుదిక్కులా విస్తరించిన ఘనత కచ్చితంగా రాణీ రుద్రమదేవికే దక్కుతుంది. రుద్రమ పాలన, ప్రజా సంక్షేమం వంటివి నేటి ప్రభుత్వాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటి వీరనారి రుద్రమదేవి వర్థంతి నేడు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం, చందుపట్ల గ్రామంలో సరిగ్గా 730 ఏళ్ల క్రితం రుద్రమదేవి వీరమరణం పొందినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. శత్రువుల గుండెల్లో గుర్రాలు పరుగుపెట్టించిన ధీరవనిత […]

విదేశాలలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మ బలికింది. ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ఇలా నిరుద్యోగ యువకుల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసింది. వరంగల్‌ నగరంలోని ట్రిమ్‌ విజన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చేసిన ఈ మోసానికి బలైన నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వరంగల్‌ నగరం దేశాయిపేట రోడ్‌లో ఉన్న ట్రిమ్‌ విజన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను […]

జనగామ జిల్లా నర్మెట్ట మండలం శివభూక్య తండాలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపిన తల్లి… ఆ తర్వాత తాను కూడా మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివభూక్య తండాకు చెందిన రమకు.. వరుణ్, భానుశ్రీ అని ఇద్దరు పిల్లలున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాల వల్లే కొన్ని రోజులుగా ఈ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. […]

భార్యా భర్తల మధ్య గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోడ్డున పడేసింది.. వరంగల్‌ జిల్లాలో కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి.. జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఏడు నెలల తన పసికందును వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు ప్రయత్నించింది.. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. అయితే, పాప ఆరోగ్యం బాగోలేక ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చానని ఆమె చెబుతోంది.. దర్యాప్తు అనంతరం శిశు […]

హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన మానవమృగం, సైకో ప్రవీణ్‌కు సంబంధించి అనేక జుగుప్సాకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. హాజీపూర్‌ సైకో శ్రీనివాస్‌ను మించిపోయేలా ప్రవీణ్‌ అరాచకాలను చేసినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. తాజా రిమాండ్‌ రిపోర్ట్‌లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్‌ ఒక సెక్సానియాక్‌గా మారాడని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రవీణ్‌ కదలికలకు సంబంధించిన సీసీ కెమెరా వీడియోలను పోలీసులు సేకరించారు. ఇంటి […]