కోరిక తీరితే చాలు.. వావి వరుసలు, మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలు బలిచేసుకుంటున్నారు. మామ తండ్రితో సమానమంటారు. అయినా కోడలిపట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కోర్కెలు తీర్చుకోవడమే పరమావధిగా చాటు మాటు వ్యవహారాలు సాగించాడు. దానికి కోడలు కూడా వంత పాడింది. మామ చేసే ప్రతి చర్యను సమర్థించింది. కర్ణాటకలోని విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామానికి చెందిన పుట్టప్ప, భార్య రేణుక, […]

ఇన్నాళ్ళు భార్యాభర్తలు గొడవల కారణంగా విడాకులు తీసుకున్న సంఘటనలను చూశాం. ఈమధ్య కాలంలో విచిత్రమైన కారణాలతో కపుల్స్ విడిపోతున్నారు. తాజాగా ఓ నూతన జంట విడాకుల విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ భార్య.. తన భర్త పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తనను పట్టించుకోవడం మానేశాడని విడాకులు కోరుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడికి కొద్ది రోజుల కిందటే వివాహం జరిగింది. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన జంటలు హనీమూన్‌ను ఎంజాయి […]

ఓ భర్త.. భార్య అవస్థను చూడలేక ఆమెకు ఈ లోకం నుంచి శాశ్వత విముక్తి కల్పించాడు. చివరకు తను కూడా తనువు చాలించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో చోటుచేసుకుంది, గణేష్ అనే వ్యక్తి పూణేలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య వృశాలి గత కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. ప్రాణంగా ప్రేమించిన భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన గణేష్ భార్య వృశాలిని చంపి […]

అందరూ తనను అసహ్యించుకుంటున్నారన్న ఆవేదనతో గిరిజన యువకుడు తన నాలుకను కోసి తన భార్య చేతిలో పెట్టిన ఘటన నల్లమలలో సంచలనం రేపింది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం సార్లపల్లిలో ఈఘటన చోటుచేసింది. చంద్రయ్య దంపతులు సమీప అటవీ ప్రాంతంలో ఆటవీ ఉత్పత్తులను సేకరించి జీవనం సాగిస్తున్నారు. అయితే ఊళ్లో అందరూ తనను తిడుతున్నారంటూ ఇంట్లో చాకును తీసుకుని తన నాలుకను కోసి తన భార్య లింగమ్మ చేతిలో పెట్టారు. […]

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ ప్రబుద్ధుడు మద్యానికి బానిసై భార్యనే జూదంలో పెట్టాడు. ఆ పందెంలో అతను ఓడిపోవడంతో జూదంలో పాల్గొన్నవారు ఆమెను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా వారు ఆమెను పట్టించుకోలేదు. చివరకు ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్త, నిందితులపై పోలీసులు కేసు నమోదుచేశారు. యూపీలోని జాన్‌పూర్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ […]

దంపతుల మధ్య మాటామాటా పెరిగింది. చివరికి ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. పట్టరాని కోపం ఊగిపోయిన భార్య కర్రతో భర్త తలపై విపరీతంగా కొట్టింది. ఈ దాడిలో భర్తకు తీవ్ర రక్తస్రావమైంది. భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక భర్త స్పాట్‌లోనే కన్నుమూశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో జరిగింది. కట్టుకున్న భార్యే భర్తను చంపడం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే భార్యకు మతిస్థిమితం లేదని బంధువులు, స్థానికులు […]

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. కసాయి భార్య. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన నాయుడి గంగారాం అతని భార్య గంగవ్వకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తరచు గొడవపడుతున్న భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న గంగవ్వ నిన్న రాత్రి దారుణానికి ఒడిగట్టింది. అర్ధరాత్రి గంగారాం నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో తలపై కొట్టి చంపింది. అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు […]

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అంతలోనే భార్యపై చిత్రహింసలు మొదలుపెట్టాడు. ఏడాది నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నా పార్వతి భరిస్తూ వచ్చింది. తాజాగా బ్లేడ్‌తో భర్త రామదేవర కృష్ణ దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో జరిగింది. స్టేషన్‌కు వెళ్లాక ఫిట్స్‌ రావడంతో పార్వతిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది.

ఆస్తి కోసం కట్టుకున్న భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిర్కూర్‌ మండలం కిష్టాపూర్‌లో ఈ ఘటన కలకలం రేపింది. కామయ్యకు గత కొంతకాలంగా ఆస్తిపంపకాల విషయంలో భార్య లాలవ్వ, కొడుకులు విరేశం, సాయిలుతో విభేదాలున్నాయి. దీంతో కామయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి కమ్యూనిటీ హాల్‌లో ఉంటున్నాడు. కామయ్య నిద్రిస్తున్న సమయంలో ఆర్థరాత్రి లాలవ్వ తనకొడుకులతో వెళ్లి దాడి చేసింది. ఆ తర్వాత ఉరివేసి చంపి […]

ఆవిడ మీద నాకు పీకలదాకా కోపం వుంది. అసలామెతో పదేళ్లు ఎలా కాపురం చేసానో అర్థం కావట్లేదు. అమె అనవాళ్లు ఏమైనా కనిపిస్తే చాలు విసిరి అవత పారేస్తా.. అంటూ ఆమె ఉంగరాన్ని ఓ చేప తోకకి పెట్టాడు. ఈ వింత స్టోరీ అమెరికాలో జరిగింది. జేసన్ రోజ్ అనే వ్యక్తికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. కానీ అది ఆయన భార్యకు ఇష్టం లేదు. రోజూ దీని […]