ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటాన్ని తప్పుబట్టింది. ఈ అంశంపై 10 రోజుల్లో పూర్తి వివరాలు అందించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కొద్దిరోజులుగా ఏపీలో కలర్స్ పాలిటిక్స్ పై దుమారం చెలరేగుతూనే ఉంది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా కలర్లు వేయటంపై ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పోకడను తప్పుబడుతూ నిరసన […]

అధికార, ప్రతిపక్షం మధ్య రివర్స్ టెండరింగ్ మరోసారి మాటల యుద్ధానికి కారణమైంది. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి 14 వందల కోట్లు మిగిల్చామని అధికార పార్టీ చెబుతున్నారు. అయితే..అది రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అని ఆరోపించారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రివర్స్ టెండరింగ్ పై శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది. రివర్స్ టెండరింగ్ తో మేం ప్రజాధనాన్ని మిగిల్చామని అధికార పార్టీ. కాదు.. మీకు అనుకూలమైన […]

అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు, మార్షల్స్ మధ్య గొడవపై శుక్రవారం సభలో పెనుదుమారం చెలరేగింది. సభలోకి వస్తుంటే గేట్లు మూసేసి తమను అడ్డుకున్నారని TDP సభ్యులు చెప్తుంటే.. మార్షల్స్‌పై దాడి చేసింది తెలుగుదేశం MLAలు, MLCలేనని అధికారపక్షం వీడియో ప్లే చేసి చూపించింది. మార్షల్స్‌ను దూషిస్తూ, వారిపై దాడి చేయడం అత్యంత దారుణమని YCP మంత్రులు, సభ్యులు మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి […]

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చజరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. మున్సిపల్‌ స్కూళ్లలో తమ పాలనలో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెడితే మీరు వ్యతిరేకించలేదా? అంటూ సాక్షిలో వచ్చిన కథనాలు ప్రతిపక్షనేత చంద్రబాబు బయటపెట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన సీఎం జగన్‌ ఇంగ్లీష్‌ మీడియం వద్దని తాను ఎప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై […]

మీడియాపై ఆంక్షల అంశం మరోసారి ఏపీ అసెంబ్లీ లోపల, బయట తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. 2430 జీవోను రద్దుచేయాలని, టీవీ ఛానళ్లపై ఆంక్షలు ఎత్తేయాలని టీడీపీ ఆందోళనకు దిగింది. మీడియా గొంతు నొక్కడం సరికాదంటూ చంద్రబాబు బృందం గవర్నర్‌కు పిర్యాదు చేసింది. మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు […]

ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు సహా, టీడీపీ సభ్యులను మార్షల్స్‌ అడ్డుకోవడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సభలోకి రాకుండా మార్షల్స్‌ అడ్డుకుంటున్నారని.. ఇదంతా ప్రభుత్వమే చేయిస్తోందని టీడీపీ నేతలు స్పీకర్‌ పోడియం ముందు నిరసనకు దిగారు. మీ సీటు దగ్గరకు వెళ్లి సమస్య చెప్పండి అని స్పీకర్‌ సూచించారు. టీడీపీ నేతల తీరుపై అంబటి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షం కావాలనే సభలో […]

ఏపీ అసెంబ్లీలో అధికార – విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇంగ్లీష్‌ మీడియం అమలు అంశం మూడో రోజు అంసెబ్లీని కుదిపేశాయి. సభ్యుల ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై సభలో డైలాగుల యుద్ధం కొనసాగింది. చివరికి తెలుగు మీడియంపై చర్చ స్పీకర్‌ వర్సెస్‌ చంద్రబాబు అన్నట్లుగా మారిపోయింది. అవే ఆవేశాలు.. అంతే స్థాయిలో సెటైర్లు.. వ్యక్తిగత విమర్శలు.. ఎక్కడా తగ్గని నేతలు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో కనిపించిన దృశ్యాలు. […]

సన్నబియ్యం ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఆ హామీని ఎందుకు అమలు చేయలేక పోతోందని ప్రశ్నించారు టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు. చివరికి సన్నబియ్య ఇవ్వడం లేదని, కేవలం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేస్తామని మాట మార్చారని సభలో లేవనెత్తారు. ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారని ప్రశ్నించారాయన. ప్రతి తెల్లరేషన్‌ కార్డు దారుడికి సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు అచ్చెన్నాయుడు.

  రాయల పాలనలో వజ్రాలు రాసులు పోసి అమ్మితే.. ఇప్పటి ముఖ్యమంత్రి హయాంలో ఇసుకను రాసులు పోసి అమ్మే పరిస్థితి ఏపీలో దాపురించిందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారని మండిపడ్డారు. ఇసుక కూడా బంగారంలా మారిపోయిందన్నారు. వైఎస్‌ వివేకా హత్యకేసులో ఇప్పటి వరకు పురోగతి లేదన్నారు. రావాలి జగన్‌ కావాలి […]

  ఏపీలో అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఉన్నంతమాత్రాన సరిపోదని.. వాటిని అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ఆరు నెలల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దిశ సంఘటన సత్వర న్యాయం అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు. […]