టీసీఎస్‌లో 3 ఏళ్ల బీఎస్సీ కోర్సు.. విద్యార్థులకు అనేక అంశాల్లో నైపుణ్యం

టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కాగ్నిటీవ్ సిస్టమ్స్‌తో కంప్యూటర్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. డిజిటల్ టెక్నాలజీలో అవసరమైన టెక్నాలజీ స్కిల్స్ అవసరాన్ని గుర్తించి 3 ఏళ్ల బీఎస్సీ కోర్సు రూపొందించినట్లు టీసీఎస్ కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ ఆయేషా ఎస్ బసు తెలిపారు. ఇందుకోసం దేశంలోని పలు విద్యా సంస్థలతో చేతులు కలిపారు. ఈ కోర్సును అభ్యసించే విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌లో ఉండే ముఖ్యమైన టాపిక్స్ తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా మెళకువల్ని నేర్చుకుంటారని ఆయేషా తెలిపారు. ఈ కోర్సు చదివే వారికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, వర్చ్యువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, సీఆర్ఎం ప్రాసెస్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాల్లో నైపుణ్యం లభిస్తుందని, మూడేళ్లలో టెక్ ఇండస్ట్రీకి అవసరమైన మెళకువలతో విద్యార్థులు సిద్ధమవుతారని ఆయేషా అన్నారు.
ఇండస్ట్రీకి కావాల్సిన సిలబస్‌ను టీసీఎస్ రూపొందించిందని, ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్‌తో పాటు మరిన్ని ఉద్యోగావకాశాలు ఉంటాయని శ్రీ క్రిష్ణ ఇన్‌స్టిట్యూషన్స్ సీఈఓ కే.సుందరరామన్ తెలిపారు. కంప్యూటర్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్ ఆటోమేషన్‌తో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, డేటా సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

చిరుత పులి కాదట.. జంగు పిల్లి!

Thu Aug 1 , 2019
హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లో చిరుత తిరుగుతోందన్న ప్రచారం కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న గీతాంజలి స్కూల్లోకి రాత్రి చిరుత వెళ్లిందన్న వార్తలతో.. ఫారెస్ట్‌ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రాత్రంగా అక్కడే ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. ఉదయం స్కూల్‌ భవనం మొత్తాన్ని పరిశీలించారు. అయితే చిరుత ఉన్న ఆనవాళ్లేమి కనిపించలేదు. అయితే అది జంగు పిల్లి అయి ఉంటుందని భావిస్తున్నారు. గాండ్రింపులు విన్నామని చెప్పిన వాచ్‌మెన్‌తో పాటు […]