అమరావతిలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభం

Read Time:0 Second

అమరావతిలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇవాళ్టి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మండలిలో టీడీపీకి 32 మంది సభ్యులు ఉండగా… టీడీఎల్పీ సమావేశానికి 23 మంది హాజరయ్యారు. మరో ఐదుగురు ఎమ్మెల్సీలు వివిధ కారణాలతో తాము రాలేకపోతున్నట్టు పార్టీకి సమాచారం అందించారు. కాసేపట్లో శమంతకమణి హాజరు కాబోతున్నారు. ఈ లెక్కన ఐదుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు లెక్క తేలింది.

గాలి ముద్దుకృష్ణమ నాయుడి వర్ధంతి కాబట్టి.. తాను రాలేనని గాలి సరస్వతి చెప్పారు. కేఈ ప్రభాకర్‌ ఇంట్లో మేనత్త కర్మ కార్యక్రమం ఉంది. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నందున తాను రాలేనని శత్రుచర్ల స్పష్టంచేశారు. వివాహ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నందున తాను సమావేశానికి రాలేకపోతున్నట్టు తిప్పేస్వామి.. పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. మరో ఎమ్మెల్సీ AS రామకృష్ణ విదేశీ పర్యటనలో ఉన్నందున గైర్హాజరువుతున్నట్టు తెలిపారు.

మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పెద్దలసభను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు సీఎం జగన్.. సూచనప్రాయంగా స్పష్టంచేశారు. రేపు మంత్రివర్గం సమావేశం కాబోతోంది. అసెంబ్లీ సమావేశం కూడా ఉంది. మండలి రద్దుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది టీడీఎల్పీలో చంద్రబాబు చర్చిస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close