వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు

vam

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. గతంలో జగన్ ను తిట్టిన వంశీ ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. అన్నం తిన్న వారెవరూ వైసీపీలో ఉండరని విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏ కారణాలతో వైసీపీలోకి వెళ్తున్నారని నిలదీశారు. గతంలో వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో తేడా చూపిస్తూ.. ఓ విడీయో మీడియాకు రిలీజ్ చేశారు..

గురువారం ఓ లైవ్ లో బాబూ రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. కేవలం రాజేంద్ర ప్రసాద్ ను బెదిరించడానికే అలా మాట్లాడారా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడడానికి.. ఆస్తులను కాపాడుకునేందుకే వంశీ పార్టీ వీడారని ఆరోపించారు..

అధినేత చంద్రబాబును, లోకేష్ ను విమర్శించే స్థాయి వంశీకి లేదన్నారు టీడీపీ నేత పంచమర్తి అనురాధ. అసలు లోకేష్ పై ఇంత తీవ్రంగా విమర్శలు చేయడానికా కారణాలు ఏంటో తెలీదన్నారు. లోకేష్ కి .. జగన్ కి చాలా తేడా ఉందని పంచమర్తి రాధ అన్నారు.

TV5 News

Next Post

డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Fri Nov 15 , 2019
ఒంట్లో షుగర్ లెవల్స్ ఉండటం మంచిదే.. కానీ అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా ఉంటే మాత్రం ప్రమాదకరం. డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి వేలాది మంది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం, 2017 లో భారతదేశంలో సుమారు 72 మిలియన్ల మంది రోగులు డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ అంచనా ప్రకారం, భారతీయులు ఎంత తీపిగా ఉన్నారో మనం అంచనా వేయవచ్చు. హా-హా, తమాషా! డయాబెటిస్ […]