ప్రతిపక్షాలను వేధించటం తప్ప.. 6 నెలల్లో చేసిందేమి లేదు: టీడీపీ

babu

నేతలు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ 6 నెలల్లో ప్రతిపక్షంపై కక్షసాధింపులకు దిగడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు ఆ పార్టీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఆర్థిక మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు.

టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే.. ఇప్పుడు అంతా నాశనం చేస్తున్నారని విమర్శించారు నేతలు. రాష్ట్రంలో మైన్స్, ఇసుక, లిక్కర్ ద్వారా వైసీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేదంపై ప్రకటనలు తప్పా.. ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశాలన్నింటిపైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సమావేశంలో నిర్ణయించారు. అటు పార్టీ సంస్థాగత ఎన్నికలపైనా చర్చించారు.

TV5 News

Next Post

బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సంచలన వ్యాఖ్యలు

Thu Nov 21 , 2019
కర్ణాటకలో ఆపరేషన్ కమల్‌కు తెరపడలేదా..? విపక్షాల నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను లాగే పనిలో కమలనాథులు నిమగ్న మయ్యారా..? ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌లకు మళ్లీ షాక్ తగలనుందా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే కన్నడనాట చర్చనీ యాంశమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రేణుకాచార్య వెల్లడించారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌లలో ముఖ్యనేతల తీరుతోనే 17మంది […]