కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా.. – టీడీపీ

మాజీ సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆ పార్టీ లీడర్లు ఆరోపించారు. లోకేష్ ను జడ్ కేటగిరీ నుంచి వై ప్లస్ కు తగ్గించడం అలాగే భువనేశ్వరి, బ్రహ్మణికి పూర్తిగా తొలగించడాన్ని ఖండించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తోపాటు వారి కుటుంబ సభ్యులకూ భద్రత కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమైన సీనియర్ లీడర్లు పలు అంశాలపై చర్చించారు.

ప్రజావేదికను కూల్చాలన్న నిర్ణయం కూడా సరైందికాదన్నారు టీడీపీ నేతలు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలన్నీ అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని గుర్తుచేశారు. కరకట్టలోపల అక్రమంగా నిర్మించిన చాలా భవనాల్లో అప్పటి ఉడా ఛైర్మన్ మల్లాది విష్ణు నిర్మించినవే అన్న విషయం సీఎం జగన్ కు గుర్తులేదా అని నిలదీశారు టీడీపీ నేతలు.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన భవనాన్ని క్రమబద్దీకరించాలంటూ వైఎస్సార్ అప్పట్లో రాసిన లేఖ విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు .

ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రుద్రమాంబపురంలో టీడీపీ మహిళ కార్యకర్త పద్మ సూసైడ్ చేసుకోవడంపై నేతలు స్పందించారు.. వెంటనే ఆ గ్రామంలో పర్యటించి కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో విత్తనాల కొరత పెరిగిపోవడంపైనా సమావేశంలో చర్చించారు టీడీపీ నేతలు… ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తనాల పంపిణీ సక్రమంగా జరిపి..రైతుల ఇబ్బందులను తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం

Tue Jun 25 , 2019
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తొలి విడతగా 1150 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు సీపీఐ లీడర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు. గుంటూరు కొత్తపేటలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమతి సమావేశం జరిగింది.. ప్రభుత్వం త్వరలోనే ఈ నిధుల విడుదలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని ముప్పాళ్ల కోరారు. అగ్రిగోల్డ్ బాధితులెవరూ అధైర్యపడొద్దని..అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు