మంత్రి కొడాలి నానిపై… కేశినేని నాని ఆసక్తికర పోస్ట్

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో మరోసారి చెలరేగారు. ఈసారి మంత్రి కొడాలి నానిపై పోస్ట్ పెట్టారు. తనను మంత్రిని చేసిన దేవినేని ఉమకు..కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ కేశినేని నాని పోస్ట్ చేశారు. మెసేజ్ కింద నవ్వుతున్న ఎమోజీ కూడా పెట్టారు. ఇదిప్పుడు పెద్ద చర్చకే దారి తీస్తోంది. ఇంతకీ ఇది కొడాలి నానీని పొగిడినట్టా.. లేదంటే దేవినేని ఉమను తిట్టినట్టా అనే దానిపై ఎవరి విశ్లేషణ వాళ్లు చేసుకుంటున్నారు.

కృష్ణా జిల్లాలో పార్టీ ఓటమికి దేవినేని ఉమ తీరే కారణమంటూ.. కేశినేని నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ సన్నిహితులు చెప్తున్నారు. ఉమ తీరు వల్లే తెలుగుదేశానికి ఈ పరిస్థితి వచ్చిందన్న వాదన కూడా ఎంపీ వర్గం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి కొడాలి నానీని పొగుడుతూ పోస్ట్ పెట్టడం అంటున్నారు. గత వారం కూడా ఎంపీ నాని ఇలాంటి పోస్టే పెట్టారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ మెసేజ్ చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మనసున్న బిచ్చగాడు.. అడుక్కున్న సొమ్మంతా..

Mon Jun 10 , 2019
గుడి ముందు బిక్షాటన చేసుకునే బిచ్చగాడు తాను సంపాదించిన ఒక్కో రూపాయిని దాచి పెట్టి ఆలయ అభివృద్ది కోసం విరాళంగా ఇచ్చి తన మంచి మనసుని చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చేబోలు కామరాజు అరవై ఏళ్ల క్రితం ఏదైనా వ్యాపారం చేసుకుందామని విజయనగరం జిల్లా చీపురు పల్లికి వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో అతడి రెండు కాళ్లు […]