శాడిస్టు టీచర్‌.. ఐదుగురు విద్యార్ధినిలను..

కర్నూలు జిల్లా డోన్‌ పట్ణణంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. స్కూల్‌కు లేటుగా వస్తున్నారని.. సరిగా చదవడంలేదంటూ ఐదుగురు విద్యార్ధినిలను చితకబాదాడు. ఉపాధ్యాయుడు శివప్రసాద్‌ క్లాసులోకి రాగానే విద్యార్ధినిలు లేచి నిలుచున్నారు. అయితే.. అదే సమయంలో శివప్రసాద్‌కు ఫోన్‌ రావడంతో మాట్లాడుతూ విద్యార్ధినిలను పట్టించుకోలేదు. దీంతో..విద్యార్ధినిలు అలాగే నిలుచున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న శివప్రసాద్‌ కోపోద్రిక్తుడై తనవైపు నిలుచున్న ఐదుగురు విద్యార్ధినిలను విచక్షణ రహితంగా కర్రతో చితకబాదాడు.

పిల్లల ఏడుపులు విని బయట స్వీపర్‌ పనిచేస్తున్న లక్ష్మీదేవి పరిగెత్తుకొచ్చింది. తన కూతురు లావణ్య కూడ అదే స్కూల్‌లో చదువుతోంది. అదే సమయంలో టీచర్‌ శివప్రసాద్‌ తన కూతురు లావణ్యను కర్రతో చితకబాదడం చూసి లక్ష్మీదేవి హతాశురాలయ్యింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన భర్తకు బంధువులకు ఫోన్‌ చేసింది, వారు విద్యార్ధి సంఘాలతో కలసి స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. కల్లబొల్లి మాటలు చెప్పి గాయపడ్డ విద్యార్ధిని లావణ్యను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శాడిస్టు టీచర్‌ శివప్రసాద్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రులతో కలసి విద్యార్ధిసంఘాలు స్కూల్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కూతుర్ని కాటేసిందని పాముని పట్టుకునేసరికి..

Wed Jul 10 , 2019
పాముని చూస్తే పరుగులు పెడతాం. ఇక అది కాటేస్తే అంతే సంగతులు. విషం శరీరం మొత్తం పాకకుండా ఉండాలని వెంటనే ఆసుపత్రికి పరిగెడతాం. అలాంటిది ఓ మహిళ తనను కాటేసిన పాముని అత్యంత చాకచక్యంగా పట్టుకుని మరీ ఆసుపత్రికి వెళ్లింది. అదీ తనను కాటేసింది భయంకరమైన విషసర్పమని తెలిసి కూడా. ముంబయిలోని ధారావీ ప్రాంతానికి చెందిన సుల్తానా ఖాన్ అనే మహిళ తన కుమార్తెతో కలిని ఉదయం పూట టిఫిన్ […]