తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు191 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆదివారం చివరి రోజు ఆటలో భారత బౌలర్లు విజృంభించడంతో సఫారీలు చేతులెత్తేశారు. పేసర్‌ మహ్మద్‌ షమీ స్పిన్నర్‌ రవీంద్ర తమ మ్యాజిక్‌ తో దక్షిణాఫ్రికాను మట్టికరిపించారు. చివరి ఆటగాళ్లు పీయడ్త్‌-ముత్తుసామిలు తీవ్రంగా ప్రతిఘటించడంతో భారత్‌ విజయం కొంత ఆలస్యమైంది. లేదంటే ఉదయాన్నే అయిపోవలసి ఉండేది.

కాగా 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదోరోజు ఆటను కొనసాగించిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రయాన్‌ను.. అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఆపై పేసర్‌ మహ్మద్‌ షమీ చెలరేగిపోయాడు. బావుమాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన తర్వాత, డుప్లెసిస్‌, డీకాక్‌(0)లను షమీ ఔట్‌ చేశాడు. స్పిన్‌ మాయాజాలం చేసిన రవీంద్ర జడేజా. మార్కరమ్‌(39),ఫిలిండర్‌(0), మహరాజ్‌(0)లను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సఫారీలు.. చివరి వరుస ఆటగాళ్లలో ముత్తుసామీ, పీయడ్త్‌లు మ్యాచ్‌ను డ్రా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

TV5 News

Next Post

కొట్టుకుపోయిన మూసీ గేటు.. 6 వేల క్యూసెక్కుల నీరు వృథా..

Sun Oct 6 , 2019
దశాబ్దాల చరిత్ర కలిగిన మూసి ప్రాజెక్టు భవితవ్యం మరోసారి ప్రమాదంలో పడింది. గేట్ల లీకేజీతో ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 3ఏళ్ల క్రితమే 14కోట్లతో ప్రాజెక్ట్ గేట్ల పునరుద్దరణ చేపట్టారు. ఐనా ఇంతలోనే 6 నెంబర్‌ గల గేటు శిథిలావస్థకు చేరుకుని ఓవైపు ఊడిపోయింది. దీంతో నీరు వృథాగా పోతుంది. ప్రాజెక్టులో నీటిశాతం తగ్గుముఖం పడుతుండడంతో కుడి, ఎడమ కాలువ ఆయకట్టు రైతులు..కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇప్పటి […]