వచ్చే వారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 18,19 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. నూతన చట్టం కోసం 18న అసెంబ్లీ 19 న మండలి సమావేశం కానున్నది. జులై 18 న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందేలా ప్లాన్‌ చేస్తున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ మండలి సమావేశాల్లో కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏమీ ఉండవు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపం తెచ్చేందుకు ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సీఎం తెలిపారు..

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్న బీజేపీ.. త్వరలోనే భాజాపాలోకి కీలక నేతలు

Thu Jul 11 , 2019
రాష్ట్రంలో పార్టీలు మ‌రోమారు ఎన్నిక‌ల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో మునిపల్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అర్బ‌న్ ప్రాంతాల్లో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు క్షేత్ర స్థాయిలో త‌మ అవ‌కాశాల‌ను మెరుగుపరుచుకునేందుకు విస్తృత ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో ప‌ట్టుకోసం తాప‌త్ర‌య ప‌డుతున్న బీజేపీ కూడా మునిసిపాలిటీల్లో తాము మెజారిటీ స్థానాల‌ను […]