డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేదు

తెలంగాణ స్టేట్ కోపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్-TSCAB స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్‌ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నిర్వహించనుంది. ఇంటర్వ్యూ లేదు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://tscab.org చూడొచ్చు. ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 8.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30

అప్లికేషన్ ఫీజు చెల్లింపు: 2019 సెప్టెంబర్ 8 నుంచి 2019 సెప్టెంబర్ 30.. ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ: 2019 నవంబర్ 2, విద్యార్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు ఇంగ్లీష్ భాష, కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసుండాలి. తెలుగులో నైపుణ్యం ఉండాలి. వయసు: 20 నుంచి 28 ఏళ్లు. ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.300.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పోలీసులకు అఖిలప్రియకు మధ్య వాగ్వాదం

Wed Sep 11 , 2019
పల్నాడులో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారీగా మోహరించిన పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, సీనియర్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో చలో ఆత్మకూరును అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నేతలను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు […]