కౌంటింగ్‌లో తేడాలు..తొలుత కాంగ్రెస్ ..ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గెలిచినట్టు చెప్పి..‌

కౌంటింగ్‌లో తేడాలు..తొలుత కాంగ్రెస్ ..ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గెలిచినట్టు చెప్పి..‌

సూర్యాపేట జిల్లా కోదాడలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అనంతగిరి మండలంలో జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థికి తొలుత మూడు ఓట్లు మెజార్టీ రావడంతో అందరు అతను గెలినట్టుగా భావించారు అయితే.. టీఆర్‌ఎస్‌ నాయకులు రీకౌంటింగ్‌ కోరారు. ఆతర్వాత గులాబీ పార్టీ ఆరు ఓట్ల తేడాతో గెలిచింది . ఈక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి అక్కడి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. కలెక్టర్ , పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి 3సార్లు రీ కౌంటింగ్‌కు అవకాశం ఇచ్చినపప్పుడు తమకు ఒక్కసారి కూడా రీ కౌంటింగ్‌కి ఎందుకు అవకాశం ఇవ్వరని ప్రశ్నించారు. కనీసం తమకు సమాధానం చెప్పకుండా కలెక్టర్ వెనుక నుండి ఎందుకు వెళ్లిపోయారని మండిపడ్డారు.. అధికార పార్టీకి అమ్ముడు పోవడంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల తీరుకు నిరసనగా కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిరసనకు దిగారు . అర్థరాత్రి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నాయకులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

Tags

Read MoreRead Less
Next Story