తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్..

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్..

తెలంగాణలో మళ్లీ సమ్మెకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ కార్మికులు.. ఇప్పటికే JAC తరుపున RTC యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి కార్మిక సంఘాలు.. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశాయి.. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23, 24 తేదీల్లో డిపోల ముందు ధర్నాలు చేస్తామని.. అప్పటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి..

ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వద్దామ రెడ్డి ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణ ఇప్పటి వరకు ​మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకలజనుల సమ్మెలో 20రోజులు పోరాడిన కార్మికులను ప్రభుత్వం దూరం చేస్తోంది అన్నారు.

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని.. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు కో కన్వీనర్‌ రాజి రెడ్డి. అన్ని యూనియన్లను కలిపి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story