చేప కోసం గాలం వేస్తే.. భయంకరమైన పాము..

టెక్సాస్‌లోని హౌస్టన్, లూసియానా ప్రజలకు చేపలు పట్టడం హాబీ. ఓ యువకుడు రోజులానే ఆ రోజు కూడా ఉదయాన్నే గాలం తీసుకుని చేపలు పట్టడానికని సరస్సు దగ్గరకు వెళ్లాడు.  గాలం తీసుకుని సరస్సులో వేశాడు. కొద్దిసేపటికి గాలం బరువుగా అనిపించడంతో పెద్ద చేప ఏదో చిక్కుకుని ఉంటుందనుకుని పైకి లాగాడు. తీరా చూస్తే ఓ పేద్ద పాము దాని నోట్లో ఓ చేప గిల గిలా కొట్టుకుంటోంది. దాన్ని చూడగానే ఏ ఎక్స్‌ప్రెషనూ లేదు అతడి ముఖంలో. ఈ వీడియోను టెక్సాస్ వైల్డ్ బాయ్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గేలానికి పాము చిక్కుకున్నా అతడు చాలా ధైర్యంగా ఉన్నాడని, అదే తామైతే పాముని చూడగానే భయంతో పరుగులు పెట్టేవారమని కామెంట్ చేస్తున్నారు. ఆ తరువాత ఏం చేశావ్ అని కొందరంటే.. నీ ఎక్స్‌ప్రెషన్ సూపర్ బాస్ అంటూ మరికొందరు.. నీ కోసమే ఆ చేపను పాము పట్టుకొచ్చింది అని కొందరు.. ఎవరు ముందు కదులుతారు.. చేపా.. పామా అని ఇలా బోలెడు కామెంట్లు పెడుతున్నారు.

 

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

తక్కువ ధరకే సెల్‌ ఫోన్‌.. ఆన్‌లైన్‌ మోసం

Thu Jul 11 , 2019
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆన్‌లైన్‌ మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకే సెల్‌ ఫోన్‌ పంపిస్తామని కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. నక్కబండకు చెందిన సుహెల్‌కు MI-5 సెల్‌ ఫోన్‌ తక్కువ ధరకే ఇస్తామని కాల్‌ వచ్చింది. 7 వేల 5 వందల రూపాయల ఫోన్.. కేవలం 4 వేల 500 చెల్లిస్తే పోస్టల్‌ ద్వారా పంపుతామన్నారు కేటుగాళ్లు. ఇది నమ్మిన సుహెల్‌ డబ్బులు చెల్లించడానికి అంగీకరించాడు. తనకు […]