కిలో ద్రాక్ష రూ.7.5 లక్షలు.. అంత రేటు ఎందుకో తెలిస్తే..

అందని ద్రాక్ష పుల్లన అంటారు. కానీ ఈ తియ్యని ద్రాక్ష రేటు మాత్రం అందరికీ అందనంత ఎత్తులో ఉంది. రుబీ రోమన్ గ్రేప్స్‌గా పిలిచే ఈ ద్రాక్ష పండ్లను చాలా అరుదుగా పండిస్తారట జపాన్ వాసులు. అందుకే 11వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.7.5 లక్షలు) పెట్టి కొనడానికి సైతం పోటీ పడ్డారు. జపాన్‌లోని ఇషికావా దీవిలో వీటిని పరిమిత సంఖ్యలో పండిస్తారు. 2008 నుంచి పండిస్తున్న ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పంట కోతకు వచ్చాక మొదటి విక్రయంలో ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెడతారు నిర్వాహకులు వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా. ఇక ఈ ద్రాక్ష గుత్తిని కొనుగోలు చేయడానికి వందల మంది పోటీపడుతుంటారు.

ఇంతకీ ఎందుకంత రేటు.. ఏంటో అంత స్పెషల్ అని అనిపిస్తోంది కదూ.. ఇవి తింటే ఆయుష్షు పెరుగుతుందా.. లేక ఎప్పటికీ నవ యవ్వనంతోనే ఉంటారా అనే అనుమానం కూడా వస్తోంది కదూ.. అవేవి కాదండి.. ధరకు తగ్గట్లే ఈ ద్రాక్ష పండ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. చాలా తీయగా, పుల్లగా లేకుండా, ఎక్కువ రసం కలిగి ఉంటాయని అంటున్నారు. సాధారణ రోజుల్లో కూడా ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందట. ఈ ద్రాక్ష పండ్లను ఎక్కువగా బహుమతిగా ఇతరులకు ఇచ్చేందుకు కొంటారట. కొన్ని హోటల్స్‌లో అయితే విఐపీ కస్టమర్లు వస్తే వారికి స్పెషల్‌గా అందిస్తారట. సంపన్నులు దీన్నీ లగ్జరీ ఫ్రూట్‌గా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది 26 వేల ద్రాక్ష గుత్తులను అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. 11 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ వేలంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని, ఈసారి ఎంతరైటే కొనడానికి జపనీయులు ఎగబడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కుళాయి వద్ద గొడవ.. మహిళ మృతి

Mon Jul 15 , 2019
తాగునీటి కోసం కుళాయి వద్ద జరిగిన గొడవలో ఒక మహిళ మరణించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ ఘటన జరిగింది. మండల కేంద్రంలోని పల్లివీధిలో పబ్లిక్ ట్యాప్‌ వద్ద తాతపు పద్మ, తెప్పల సుందరమ్మ మధ్య గొడవ మొదలైంది. మాటకుమాట పెరగడంతో ఇద్దరు ఘర్షణపడ్డారు. ఇద్దరు మహిళలు బిందెలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కొళాయి వద్ద ఉన్న నాచుపై కాలుజారి రోడ్డుకు తల బలంగా తగలడంతో తాతపు పద్మ […]