దిశ ఘటన.. ఈ పది రోజులు జరిగిందిదే..

Read Time:2 Second

disa

10 రోజులు..! కేవలం 10 రోజుల్లో రాక్షస సంహారం జరిగింది. నలుగురు నరకాసుల్ని వధించారు. దేశమంతా దీపావళి వెలుగులు విరజిమ్మాయి. దిశ ఘోరం జరిగినప్పుడు యావత్‌ దేశం కన్నీరు పెట్టింది. ఇప్పుడా నలుగురు మృగాళ్ల ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆసేతుహిమాచలం..ఆనందభాష్పాలు కార్చింది. క్రూరాతిక్రూరమైన.. ఘోరాతి ఘోరమైన ఆ ఘటన జరిగిన చోటే …నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ పది రోజులు ఏం జరిగిందన్నది
ఓసారి చూద్దాం….

నవంబర్-27 బుధవారం…
రాత్రి 9 గంటల ప్రాంతంలో తొండుపల్లి టోల్‌గేట్ వద్దకు చేరుకుంది దిశ. అప్పటికే పక్కా ప్లానింగ్‌తో అక్కడ మాటువేసిన నలుగురు మృగాళ్లు…ఆమెను ట్రాప్ చేశారు.. దిశ వచ్చేప్పటికే ఆమె బైక్‌లో గాలి తీసేశారు.. బైక్‌కు పంక్చర్ వేయిస్తామంటూ డ్రామా మొదలుపెట్టారు. అప్పటికే భయపడిపోయిన దిశ… తన చెల్లెలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది.. ఈలోపు కాసేపు సీన్ క్రియేట్‌ చేసిన ఆ నలుగురు .. దిశను పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతంలోకి లాక్కెల్లారు.. ఆమె నోట్లో మద్యంపోసి అత్యంత కిరాతకంగా గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఊహించని ఈఘటనతో అప్పటికే దిశ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెను దుప్పట్లో చుట్టి లారీలో వేశారు.చటాన్‌పల్లి బ్రిడ్జివైపు బయల్దేరారు. మధ్యలో
పెట్రోల్‌పంప్‌ దగ్గర ఆగి పెట్రోల్ తీసుకున్నారు. లారీలో కూడా ఒకరితర్వాత ఒకరు దిశపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.. ఆమె కొనఊపిరితో ఉండగానే…పోట్రోల్‌ పోసి…నిప్పంటించారు…డెడ్‌బాడీ కాలిపోయేంతవరకు అక్కడే ఉన్నారు…

నవంబర్-28 గురువారం….
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాలిపోతున్న మృతదేహాన్ని చూశాడో పాల వ్యాపారి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దిశ కుటుంబ సభ్యులను కూడా అక్కడికి పిలిపించారు పోలీసులు.. మెడలోని లాకెట్, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం దిశదేనని గుర్తించారు కుటుంబ సభ్యలు. ఈ ఘటనతో యావత్‌ దేశం రగిలిపోయింది. పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. స్పాట్‌ జస్టిస్ కోసం జనం రోడ్లెక్కారు..కోట్లాది గొంతుకలు ఒక్కటై ముక్తకంఠంతో నినదించాయి. అటు 24 గంటల్లోనే నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…

నవంబర్-29 శుక్రవారం..
ఈ ఘోరానికి పాల్పడింది…నలుగురు మృగాళ్లని గుర్తించారు పోలీలులు.. నిందితుల్ని మహ్మద్ అరిఫ్‌, చెన్నకేశవులు, శివ, నవీన్‌గా గుర్తించారు.. వీరిని విచారణ కోసం షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు…ఏం జరిగిందన్నదానిపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్…

నవంబర్-30 శనివారం..
నిందితులు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లో ఉన్నారని తెలియడంతో జనం భారీ ఎత్తున తరలివచ్చారు. వాళ్లను అప్పగించాలంటూ స్టేషన్‌ను ముట్టడించారు..ఉదయం నుంచి రాత్రి వరకు…తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చివరికి మెజిస్ట్రేటే కోర్టుకు
వచ్చారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుల్ని చర్లపల్లి జైలుకు తరలించారు..

డిసెంబర్‌-4 బుధవారం..
నిందితులు నలుగురిని చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు…రెండు రోజుల పాటు రహస్యప్రాంతంలో నలుగురిని విచారించారు.. కీలక ఆధారాలు సేకరించారు…అటు హైకోర్టు అంగీకారంతో దిశ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసింది ప్రభుత్వం…

డిసెంబర్‌-5 గురువారం..
దిశ హత్య కేసు విచారణ కోసం…మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేశారు.. ఒక్కో టీమ్‌లో 7 గురు సిబ్బందిని నియమించారు. వీలైనంత త్వరగా ఛార్జ్‌షీట్‌ను వేయాలన్న ఉద్దేశంతో క్లూస్‌, ఫోరెన్సిక్ టీమ్‌లు రంగంలోకి దిగాయి…మరోసారి ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. దిశ మొబైల్‌తో పాటు మరికొన్ని వస్తువులు పాతిపెట్టిన..ప్రాంతాన్ని గుర్తించారు…

డిసెంబర్‌-6 శుక్రవారం..
రహస్యప్రాంతం నుంచి..నిందితుల్ని తీసుకొని…ఘటనా ప్రాంతానికి వచ్చారు పోలీసులు. మొదట తొండుపల్లి టోల్‌గేట్‌ దగ్గర సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.. అక్కడి నుంచి దిశను కాల్చేసిన చటాన్‌పల్లి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ కూడా సీన్‌రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా…ఆ నలుగురు ఒక్కసారిగా పోలీసులపైకి దాడికి పాల్పడ్డారు.. మొదట రాళ్లతో అటాక్ చేశారు. ఆ తర్వాత … పోలీసుల నుంచి గన్ లాక్కొని కాల్పులకు తెగబడ్డారు.. ఆత్మరక్షణ కోసం…పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు హతమైయ్యారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close