వైసీపీ జెండా స్తంభానికి విద్యుత్ షాక్… ముగ్గురు చిన్నారుల మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇవాళ ఉదయం వైసీపీ జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటుండగా అది ఊగి పక్కనే ఉన్న కరెంట్ వైర్లకు తలగడంతో షాక్ కొట్టి ముగ్గురూ చనిపోయారు. ఈ వార్త గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. చనిపోయిన ముగ్గురు ఐదవ తరగతి విద్యార్థులే. షేక్ పఠాన్ గౌస్, షేక్ హసన్, పఠాన్ అమర్ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఓ నా బంగారం.. ఎంత బాగా చేశావు.. మహేష్ బాబు ఫిదా

Wed Aug 14 , 2019
చిట్టి తల్లి బుడి బుడి అడుగులేస్తూ నడిస్తే ఆనందం. పడుతూ లేస్తూ నాన్న చేయి పట్టుకుంటే చెప్పలేనంత సంతోషం. పాపాయి ప్రతి కదలికా తల్లితండ్రులకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. వచ్చీ రాని మాటలు.. ముద్దూ ముచ్చట్లు అన్నీ ఆనందాన్ని పంచేవే.. అలసట తీర్చేవే. ఎదుగుతున్న క్రమంలో ఎన్నో నేర్చుకుంటారు. ఒక్కోసారి అమ్మానాన్నలకే పాఠాలు చెబుతుంటారు. అందాల రాకుమారుడు మహేష్ బాబు కూతురు కూడా నాన్నను మించి స్టెప్పులేస్తోంది.. నాన్నకే ఔరా […]