దేశమంతా ఒక్కటి.. ఈ ముగ్గురూ ఒక్కటి..

Read Time:0 Second

leaders

దిశ కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురవడాన్ని దేశమంతా హర్షించింది. కానీ ముగ్గురు నేతలు మాత్రం మా రూటే సెపరేట్ అంటున్నారు. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ నిందితులను చట్టబద్ధంగా శిక్షించాలి కానీ ఇలా ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్నారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ పోతే చట్టాలు ఏం చేస్తాయి అని ప్రశ్నిస్తున్నారు.

ఇక కార్తీ చిదంబరం.. రేప్ అన్నది చాలా దారుణ నేరం.. చట్ట ప్రకారం వాళ్లని కఠినంగా శిక్షించాలి. కానీ ఎన్‌కౌంటర్ అనేది మన వ్యవస్థకు మాయని మచ్చ అని పేర్కొన్నారు. తక్షణ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కానీ ఈ విధంగా కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్‌ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ అన్నది మహిళల రక్షణకు సంబంధించిన అంశంలో సరైన సమాధానం కాదని అన్నారు. అయితే ఏం చేస్తే దిశకు న్యాయం జరుగుతుంది అన్నది మాత్రం చెప్పలేక పోవడం కొసమెరుపు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close