లేటెస్ట్ రాజకీయం.. టిక్‌టాక్ స్టార్‌కి పార్టీ టికెట్..

Read Time:0 Second

జనాలకి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆల్‌రెడీ బోల్డంత పాపులారిటీ వచ్చేసింది. పార్టీలో చేర్చుకుని సీటిస్తే గెలవడం ఖాయం. ఆమె వెండి తెర స్టారో లేక బుల్లి తెర పాపులర్ సీరియల్ హీరోయినో కాదు.. జనం వేలం వెర్రిగా వాడేస్తున్న టిక్ టాక్ షోలో వీడియోలు చేస్తూ పాపులర్ అయిపోయింది. అందుకే పార్టీ వాళ్ల కన్ను ఆమెపై పడింది. పిలిచి మరీ టికెట్ ఇచ్చేసారు. ఈ పాటికే సినిమా యాక్టర్లకున్నంత క్రేజ్‌ని సంపాదించుకుంది సోనాలీ పొగట్ టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్‌లు చేస్తూ. సోనాలీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. జీ టీవీలో ప్రసారమయ్యే సీరియల్ ‘అమ్మ’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఏడేళ్ల కూతురు ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకుగాను బీజేపీ అదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది. సోనాలీకి టికెట్ కేటాయిచిన విషయం తెలియగానే ఆమె ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు అదంపూర్ స్థానం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ 2000,2005 ఎన్నికల్లో రెండుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఈనేపథ్యంలో సోనాలీ గెలుపుని బలంగా కోరుకుంటోంది బీజేపీ.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close