తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగినితో సహోద్యోగులు నీచంగా ప్రవర్తించారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి యత్నించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. దాంతో బాధితురాలు ఆత్మహత్యా యత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కొంతకాలంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పనిచేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన వర్సిటీ ఐఎఫ్‌ఎల్‌సీ విభాగంలో పనిచేసే ముగ్గురు నాన్ టీచింగ్ రెగ్యులర్ ఉద్యోగులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచార యత్నం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. తాను దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ ఘటన యూనివర్సిటీలో కలకలం రేపుతోంది.

TV5 News

Next Post

విహారంలో విషాదం .. వైద్య విద్యార్థిని దుర్మరణం

Sat Nov 9 , 2019
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మారుతి సర్కిల్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగింది. 46వ వార్డు శ్రీహరిపురం, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మొగిలిపురి రవికుమార్‌ చౌదరి పెందుర్తి ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. శ్రీవిద్య పెద్ద కుమార్తె. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం […]