నేడు రాజధానిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటన

Read Time:0 Second

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇప్పటికే పలు సమస్యలపై జనంలోకి వెళ్తున్న పవన్..గతంలోనూ అమరావతి పల్లెల్లో పర్యటించారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా నిలిచారు. అయితే..ఈ సారి చేపట్టబోయే పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. ఢిల్లీ టూర్ తర్వాత సమస్యలపై బీజేపీతో కలిసి పోరాడుతున్నట్లు పవన్ ప్రకటించారు. మూడు రాజధానుల ఇష్యూలోనూ బీజేపీతో కలిసి త్వరలోనే జనంలోకి వెళ్తామని గతంలో ప్రకటించారు. అయితే..ఇవాళ, రేపు జరగబోయే పవన్ టూర్ లో బీజేపీ కనిపించటం లేదు. పవన్ సొంత షెడ్యూల్ ప్రకారమే పర్యటన కొనసాగబోతోంది.

రెండు రోజులు తన పర్యటనలో పవన్ కల్యాణ్ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి కార్యాలయం నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానుంది. తొమ్మిదిన్నరకు ఎర్రబాలెం చేరుకొని అక్కడ్నుంచి మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు అనంతవరం గ్రామానికి పవన్ చేరుకుంటారు. తన పర్యటనలో భాగంగా జనసేనాని రాజధాని ప్రాంత రైతులు, మహిళలతో మాట్లాడనున్నారు. రాజధాని మార్పుతో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఎలా నష్టపోతారనేది ఆయన తన పర్యటనలో హైలెట్ చేయబోతున్నారు. పవన్ పర్యటన కోసం ఇప్పటికే రైతులు, మహిళలు ఎదురుచూస్తున్నారు. పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక తన పర్యటనలో రెండో రెజు పార్టీ కార్యక్రమాలతో బిజీగా వుంటారు పవన్. ఉదయం 10 గంటలకు రేపల్లె జనసైనికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిగూడెం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఆపై, జనసేన న్యాయ విభాగం సమావేశంలో పాల్గొంటారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close