సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్రాఫిక్ పోలీస్ సాంగ్

హెల్మెట్‌ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ పాడిన పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. రహదారి భద్రతపై పాడిన ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సందీప్‌ సాహి అనే ట్రాఫిక్‌ పోలీస్‌, బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ నటించిన గల్లీబాయ్‌ సినిమాలోని అప్నా టైమ్‌ ఆయేగా పాటకు లిరిక్స్ మార్చి తనదైన శైలిలో పాడాడు.

సందీప్‌ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి రోడ్డు భద్రతపై అతను విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. హెల్మెట్, సీట్‌బెల్ట్‌ ధరించాలంటూ ప్రజలకు పదే పదే చెప్తున్నాడు. ట్రాఫిక్‌ నిబంధన లను ఉల్లంఘించవద్దని కోరుతున్నాడు. అదే సమయంలో తాగి వాహనాలు నడపవద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నాడు.

సందీప్ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని పాటకు పూర్తిగా ఫిదా అయ్యామని, అందుకు పదికి పది మార్కులు ఇవ్వొచ్చని కితాబిస్తున్నారు. ఇలాంటి పోలీసులే మాకు కావాల్సింది అంటూ అతనికి సెల్యూట్ చేస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వైఎస్ వివేకా హత్య కేసు.. వాచ్ మెన్‌ను విచారించిన అధికారులు

Wed Jun 19 , 2019
సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. గత ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ టీమ్ లో మొత్తం 23 మంది అధికారులు ఉన్నారు. ఇందులో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలతోపాటు ఇతర సిబ్బంది ఉన్నారు. కొత్త దర్యాప్తు బృందం పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించింది. అక్కడ వాచ్ మెన్ రంగయ్యను ప్రశ్నించారు అధికారులు. మార్చి […]