బైక్స్‌పై బంపరాఫర్.. సగానికి పైగా తగ్గింపు..

ఓ మాంచి బైక్ కొనాలనుకుంటే ఈ బంపరాఫర్ మీ కోసమే. 10, 20 కాదు ఏకంగా 55% డిస్కౌంట్ అందిస్తోంది ఓ షోరూమ్. ట్రయంఫ్ బైక్స్‌పై ఈ భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఒక డీలర్ 30 డెమో, ప్రి-ఓన్డ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తున్నారు. వీటి ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్ట్రీట్ ట్విన్ బైక్స్‌పై ఈ ధర వర్తిస్తుంది. ఇక బొన్నెవిల్లే టీ 120 ధర రూ.6.5 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌కి సంబంధించినవి. ఈ బైక్స్ 2016-18 మధ్యలో తయారైనవి. బ్రాండ్ న్యూ మోటార్ బైక్స్‌తో పోలిస్తే ఈ డీలర్ ఆఫర్ చేసే బైక్స్ ఏకంగా 55 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఒకప్పుడు రేటెక్కువని ఈ బైక్‌పై మోజుపడినా కొనాలనే కోరికను విరమించుకుంటే మాత్రం ఈ ఆఫర్‌ని వినియోగించుకోవచ్చు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పదవతరగతి అర్హతతో 'డీఆర్‌డీవో'లో ఉద్యోగాలు.. జీతం రూ.28,000

Thu May 30 , 2019
డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (డీఆర్‌డీవో)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీఆర్డీవో ఎంట్రీ టెస్ట్ అయిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్)-9కు సంబంధించిన నోటిఫికేషన్‌లో టెక్నీషియన్ ఏ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు : 351 ……. ఆటోమొబైల్-3 …. బుక్ బైండర్-11….. కార్పెంటర్-4… కోపా-55…. డ్రాప్ట్స్‌మెన్ (మెకానికల్)-20… డీటీపీ ఆపరేటర్-2… ఎలక్ట్రీషియన్-49… ఎలక్ట్రానిక్స్-37… ఫిట్టర్-59… మెషినిస్ట్-44 […]