రేణు మోండల్ మేకప్ పై వీపరితమైన ట్రోలింగ్

Read Time:0 Second

ranu

లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ను పాడిన వీడియో వైరల్ కావడంతో రేణు మోండల్ పెద్ద స్టార్‌ సింగర్‌గా వెలిగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్ రైల్వే స్టేషన్‌లో రేణు మోండల్ కాలక్షేపం కోసం పాటపాడుతుండగా ఎవరో వీడియో తీశారు.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆమె వివిధ టీవీ రియాలిటీ షోలలో కనిపించింది. అంతేకాదు హిమేష్ రేష్మియాతో కలిసి ‘తేరీ మేరీ.. తేరీ మేరీ కహానీ’ పాటను కూడా పాడింది. అది కూడా సూపర్ హిట్ అయింది. దాంతో రేణు మోండల్ పేరును సోషల్ మీడియా మారుమోగించింది. ఇప్పుడు తన మేకప్‌తో మళ్లీ వైరల్‌ అయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌ ప్రారంభోత్సవానికి ఆదివారం అతిథిగా వచ్చిన రేణూకి మితిమీరిన మేకప్‌ వేశారు. దాంతో ఆమెను ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అయింది. రేణు ముఖంపై వేసిన ఫౌండేషన్‌ బాగా ఎక్కువైంది. మేకప్‌ లేయర్‌లు కూడా పైకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేకప్ పై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఆమెకు మేకప్ చేసిన వారిపట్ల మండిపడుతున్నారు. ఈ వయసులో ఆమెకు అంత మేకప్ అవసరమా? ఆమెను నవ్వులపాలు చెయ్యడం కాకుంటే అని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close