ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఘర్షణ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సదస్సు రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో గొడవ జరిగింది. కృపేష్‌పై కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడి చేయడంతో సదస్సు ప్రాంగణంలో గందరగోళం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాట జరిగింది. టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీసీఎసీలు ఆందోళన చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అద్భుతం జరిగితే తప్ప భారత్‌ గెలిచే అవకాశాలు తక్కువే..

Wed Jul 10 , 2019
మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ లో భారత్‌ విజయం కోసం ఎదురీదుతోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. 240 పరుగుల టార్గెట్‌ ను చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయింది. ఆ తర్వాత దినేష్‌ కార్తీక్‌ ఆశలు రేకెత్తించి ఉసూరుమనిపించాడు. ఈ దశలో హార్దిక్‌ పాండ్యా, రిషత్‌ పంత్‌ జోడీ కాస్త నిలదొక్కుకుంది. జాగ్రత్తగా ఆడుతూ.. అడపాదడపా […]