మహిళపై 7 వందల మంది ప్రచారం – ఉత్తమ్‌ పద్మావతి

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో గరిడేపల్లి మండలంలోని గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు.

TRS అభ్యర్థి సైదిరెడ్డి భూ మాఫియాదారుడని మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి ఆరోపించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని 3 వేల 5 వందల కోట్లతో అభివృద్ధి చేశారని ఉత్తమ్‌ పద్మావతి అన్నారు. ఓ మహిళపై 7 వందల మంది ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌ పద్మావతి ఆరోపించారు.

TV5 News

Next Post

రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

Thu Oct 10 , 2019
రైతు వద్ద నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ తహసీల్దార్‌. కర్నూలు జిల్లా సంజమాల మండల తహసీల్దార్‌ గోవింద్‌సింగ్‌ పొలం పాస్‌ బుక్‌ విషయంలో ఓ రైతు నుంచి రూ. ఐదు వేలు డిమాండ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో గోవింద్‌సింగ్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన ఆస్తుల వివరాలపైనా విచారణ చేపట్టారు అధికారులు.