ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు

ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం డిపోల ముందు ధర్నాకు అఖిలపక్షం నిర్ణయించింది. అలాగే కేసీఆర్‌ వైఖరిపై కోదండరాం మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెగానే ఉన్నా.. త్వరలో ఇది సకల జనుల సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పుడు రాని సంఘాలు రేపు ఉద్యమంలో పాల్గొంటాయని కోదండరాం అన్నారు. ఆర్టీసీ విలీనానికి ప్రక్రియ మొదలు పెడితే తప్ప ఈ సమ్మె ఆగదని స్పష్టం చేశారు.

TV5 News

Next Post

వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి - చంద్రబాబు

Wed Oct 9 , 2019
రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్న నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఎంపీడీవో సరళ ఉదంతాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నింటికీ సీఎం జగన్‌ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు.