కేసీఆర్ దారెటు?

www

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుస్తుందా? అసలు సీఎం కేసీఆర్‌ వ్యూహమేంటీ? ఎలాంటి షరతులు లేకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. కానీ ఇంతవరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష చేస్తున్నారు. మంత్రి పువ్వాడతోపాటు ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కార్మికుల ప్రతిపాదనపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమీక్ష తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

TV5 News

Next Post

ఎల‌క్టోర‌ల్ బాండ్లపై దద్దరిల్లిన పార్లమెంట్

Thu Nov 21 , 2019
ఎల‌క్టోర‌ల్ బాండ్లపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎలక్టోరల్ బాండ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లతో అవినీతిని కప్పిపుచ్చుతున్నారని మనీష్ తివారీ ఘాటుగా విమర్శించారు. ఆర్బీఐ హెచ్చరికలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్దంగా ఎలక్టోరల్ బాండ్లు సేకరించారని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. రాజ్యసభలోనూ ఎలక్టోర్ బాండ్లపై దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో క‌ర్నాట‌క అసెంబ్లీ […]