టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉషారాణి ప్రమాణం

usharani

టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉషారాణి ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుఢళ్వార్ సన్నిధిలో టీటీడీ అడిషన్‌ ఈవో ధర్మారెడ్డి…ఉషారాణి చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు పట్టువస్త్రాలతో ఆమెను సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి దేవస్థానంలో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు ఉషారాణి. ఏపీ ప్రభుత్వం తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా నిస్వార్ధంతో సేవలు అందిస్తానన్నారు.

TV5 News

Next Post

తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై జనసేనాని స్పందన

Sun Nov 10 , 2019
ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారాయన. వైసీపీ నాయకత్వం తెలుగు భాష నిజమైన సంపదను అర్థం చేసుకుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను నిషేధించేందుకు ప్రయత్నించదని అన్నారు. వైసీపీ నాయకత్వం…. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో కేసీఆర్‌ను […]