దసరా స్పెషల్.. సుజుకీ సూపర్ డిస్కౌంట్.. రూ.777లకే బండి ఇంటికి..

పండగ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తోంది సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా. టూవీలర్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. పండుగ నేపథ్యంలో సేల్స్ పెంచుకునేందుకు సూపర్ డిస్కౌంట్ అందిస్తోంది. తక్షణ రుణ సదుపాయంతో పాటు, జీరో ప్రాసెసింగ్ ఫీజు, క్యాష్ బ్యాక్ వంటి పలు ఆఫర్లు అందిస్తోంది కంపెనీ. సాధారణంగా బైక్ కొనుగోలు చేయాలంటే డౌన్ పేమెంట్ రూ.8000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుంది. అలాంటిది సుజుకీ మాత్రం కేవలం రూ.777కే బైక్ లేదా స్కూటర్‌ ఇంటికి తీస్కెళ్లొచ్చని చెబుతోంది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహాయింపు ఇస్తోంది. సుజుకి యాక్సెస్ 25, బర్గ్‌మన్ 125, జిక్సర్, ఇన్‌ట్రూడర్ వంటి పలు టూవీలర్లను అతి తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి బండిని సొంతం చేసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని కూడా 48నెలల్లోగా చెల్లిచొచ్చు. ఇక జిక్సర్, యాక్సెస్ బండ్లపై ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా రూ.3,000 వరకు ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవేళ పేటీఎం నుంచి టూవీలర్ బుక్ చేసుకున్నట్లయితే రూ.8,500 వరకు అదనంగా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ నుంచి అయితే రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. పండుగ సందర్భంగా మరెన్నో బహుమతులను కూడా కస్టమర్లకు అందిస్తోంది సుజుకీ.

TV5 News

Next Post

ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్.. 50 వేల ప్రొడక్టులు.. 75% డిస్కౌంట్..

Mon Oct 7 , 2019
కస్టమర్లకు మరోసారి గాలం వేసింది ఫ్లిప్‌కార్ట్. మరో బ్రహ్మాండమైన బిగ్ దివాళీ సేల్‌ని నిర్వహించబోతోంది. అక్టోబర్ 11 రాత్రి 8 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్ అందించనుంది ఫ్లిప్‌కార్ట్. రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.6,490. 5 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు […]