నానీ 'గ్యాంగ్ లీడర్' ట్విట్టర్ రివ్యూ

నానీ గ్యాంగ్ లీడర్ ట్విట్టర్ రివ్యూ

నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నాని రైటర్ పెన్సిల్ పార్థసారధిగా నటించగా, నానీతో జోడీ కట్టిన ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రం ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. RX 100 ఫేమ్ కార్తికేయ నెగిటివ్ రోల్‌లో కనిపించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. నానీ యాక్టింగ్ సూపర్‌గా ఉందంటూ కొందరు, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలాలుగా చెబుతున్నారు. కార్తికేయ ఎంట్రీ కూడా అదిరిపోయిందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story