బెయిల్‌పై మారుతీరావు విడుదల.. 16 వందల పేజీల ఛార్జిషీట్..

బెయిల్‌పై  మారుతీరావు విడుదల.. 16 వందల పేజీల ఛార్జిషీట్..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. తన కూతురు అమృతను ప్రేమపెళ్లి చేసుకున్నాడనే కక్షతో.. గత సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు. పట్టపగలు అతిదారుణంగా నరికి చంపించాడు. దీంతో పాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, మరో నిందితుడు కరీం.. పీడీయాక్ట్ కింద వరంగల్‌ సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తూ బెయిల్‌పై విడుదలయ్యారు. హత్య జరిగిన తొమ్మిది నెలల తర్వాత మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ సిద్ధం చేశారు.

16 వందల పేజీలతో పోలీసులు ఛార్జ్‌షీటు రెడీ చేసి నల్గొండ కోర్టుకు సమర్పించారు. మారుతీరావు బీహారీ గ్యాంగ్‌లను ఎలా సంప్రదించాడు.. సుపారీ చెల్లింపులు ఎలా జరిగాయి.. ఎవరెవరు సాయం చేశారనే వివరాలను అందులో పొందుపరిచారు. మొత్తం 102 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఆ వివరాలన్నిటినీ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఏ1గా అమృత తండ్రి మారుతీరావును.. ఏ2గా బీహారీ గ్యాంగ్‌కు చెందిన సుభాష్‌శర్మను పోలీసులు పేర్కొన్నారు. హజ్గర్ అలీ, మహ్మద్ బారీ, కరీంలు ఆ తర్వాత ఉన్నారు. అమృత బాబాయ్ శ్రవణ్ ఏ-6గా ఉన్నాడు. మారుతీరావు డ్రైవర్ శివ, మరో ఆటోడ్రైవర్ నిజాంలను ఏడు, ఎనిమిదవ నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story