డాక్టర్ల నిర్లక్ష్యం..కాలు కోల్పోయిన బాలిక

డాక్టర్ల నిర్లక్ష్యం..కాలు కోల్పోయిన బాలిక

హైదరాబాద్‌లో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక కాలు కోల్పోవాల్సి వచ్చింది. సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలిపై కబోర్డ్‌ పడింది. దీంతో.. హుటాహుటిన చిన్నారిని స్థానికంగా ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స చేయడంలో కాలయాపన చేసిన అక్కడి డాక్టర్లు.. తర్వాత తమ వల్ల కాదని చేతులెత్తేశారు. మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లండని ఉచిత సలహా ఇచ్చారు. మరో ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లగా.. కాలు తీసేయాలని చెప్పారు.

హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యుల నిర్లక్ష్యం ఐదేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారింది. కాలు తీసేయాల్సి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం ఒక ఎత్తయితే.. పోలీసులు సైతం వాళ్లకు మద్దతు పలకడం బాధిత కుటుంబాన్ని మరింత కుంగదీస్తోంది. ఆస్పత్రి నిర్లక్ష్యంపై గత నెల 25న సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే వాళ్లు కేసు నమోదు చేయలేదు. కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని బాధిత కుటుంబం వాపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story