బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసి మర్చిపోతున్నారా.. ఓసారి చెక్ చేసుకోండి.. లేదంటే!!

పైసా పైసా కూడబెడతారు. అవసరానికి అక్కరకొస్తాయని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. మరి వాటిని అలాగే మర్చిపోతున్నారట. ఒక్క ఎస్‌బీఐలోనే 2018 చివరి నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ రూ.2వేల 156.33 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2016లో రూ.8వేల 928 కోట్లు ఉంటే.. 2017లో వీటి విలువ రూ.11వేల 494 కోట్లు ఉందని ఆమె ప్రకటించారు.
ఇక ఇన్సూరెన్స్ సెక్టార్‌లో అయితే సెప్టెంబర్ 2018 చివరి నాటికి రూ.16వేల 887.66 కోట్లు, మరి కొన్ని బీమా పాలసీల్లో రూ.989 కోట్లు చొప్పున క్లెమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.

ఆర్‌బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం.. 1949లో సెక్షన్ 26ఏ ప్రకారం.. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లను, వాటి వడ్డీలతో కలిపి ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్) కు బదిలీ చేస్తారని మంత్రి తెలిపారు. కాగా, డిపాజిట్ గడువు పూర్తయినా డిపాజిట్ దారులు రాకపోవటం ఏంటనే ప్రశ్న తలెత్తగా.. దానికి బ్యాంకు అధికారులు.. కుటుంబ సభ్యులకు తెలియకుండా డిపాజిట్ చేసే వారు కొందరైతే.. మర్చిపోయే వారు కొందరు.. మరణించేవారు కొందరు, బినామీలుగా ఉండి డిపాజిట్ చేయడం వంటి పలు కారణాలు చెబుతున్నారు. ఇలా వివిధ కారణాలతో డిపాజిట్ సొమ్ము క్లయిమ్ చేసుకోవడం లేదని అంటున్నారు. ఈ విధంగా బ్యాంకుల్లో ప్రజల సొమ్ము రూ.15వేల కోట్లు ఉందని అంటున్నారు. మరి మీ డిపాజిట్లేమైనా ఉన్నాయోమో ఓ సారి చెక్ చేసుకుని బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోండి. లేకపోతే బ్యాంకులు తీసేసుకుంటాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆస్తి కోసం భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన భార్య

Tue Jul 2 , 2019
ఆస్తి కోసం కట్టుకున్న భర్తను కొడుకుల సాయంతో హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిర్కూర్‌ మండలం కిష్టాపూర్‌లో ఈ ఘటన కలకలం రేపింది. కామయ్యకు గత కొంతకాలంగా ఆస్తిపంపకాల విషయంలో భార్య లాలవ్వ, కొడుకులు విరేశం, సాయిలుతో విభేదాలున్నాయి. దీంతో కామయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి కమ్యూనిటీ హాల్‌లో ఉంటున్నాడు. కామయ్య నిద్రిస్తున్న సమయంలో ఆర్థరాత్రి లాలవ్వ తనకొడుకులతో వెళ్లి దాడి చేసింది. ఆ తర్వాత ఉరివేసి చంపి […]