ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం..

ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ-సిగరెట్ల దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. యువతపై ఈ సిగరెట్ల ప్రభావం అధికంగా ఉందని.. అవి వారిపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. అమెరికా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు నిర్మలా సీతారామన్‌.

పొగాకు బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నవారి సంఖ్యను తగ్గించాలనేది ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేబినెట్‌ ఆమోదించింది. పొగ తాగే అలవాటు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా యువత ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్నారు. భారతీయ యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రెండో టీ-20లో భారత్ ఘన విజయం

Thu Sep 19 , 2019
సౌతాఫ్రికాతో రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేశారు. భారత్ 19 ఓవర్లలో 151 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 150 రన్స్‌లోపే పరిమితం చేసిన టీమిండియా.. సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. రోహిత్‌ శర్మ త్వరగానే అవుటైనా,  కోహ్లీ, శిఖర్‌ ధవన్‌ ధాటిగా ఆడడంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కోహ్లీ […]