దేశంలో మహిళలకు హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విన్నపం

kishan-reddy

దిశ ఉదంతంపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి దేశంలోని మహిళలకు ఓ విన్నపం చేశారు. ప్రతి ఒక్కరూ 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ యాప్ ను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చన్న ఆయన.. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, రైల్వే పోలీసులు, విమానాశ్రయాల్లోనూ సీఐఎస్ఎఫ్ పోలీసులు స్పందిస్తారుని తెలిపారు. 112 హెల్ప్ లైన్ ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలకూ నిధులను కూడా అందించినట్లు తెలిపారు కిషన్‌రెడ్డి.

TV5 News

Next Post

జగన్‌ మతం మానవత్వం కాదు.. మూర్ఖత్వం - దేవినేని ఉమా

Tue Dec 3 , 2019
జగన్‌ మతం మానవత్వం కాదు.. మూర్ఖత్వం అన్నారు టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ. ఈ ఆరు నెలల్లో ఏపీకి మొత్తం 67 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారాయన. రాష్ట్రంలో లక్ష బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయన్నారు. మద్యం షాపుల పక్కనే బెల్ట్‌ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతనికి పడిపోయిందన్న ఆయన.. 30 వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందన్నారు. మంచి ముఖ్యమంత్రి కాదు.. […]