థ్యాంక్స్ మిస్టర్ సి.. నీ ప్రేమ, సపోర్ట్..

మెగాఫ్యామిలీలో అడుగు పెట్టకముందే అపోలో హాస్పిటల్స్ చైర్మన్ మనవరాలిగా ఉపాసనకు మంచి పేరుంది. సమాజం కోసం తన వంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే ఉపాసన పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అందుకే ఉపాసనను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ క్యాటగిరీలో మహాత్మాగాంధీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తనకు సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు అందుకున్న సందర్భంగా భార్యకు స్పెషల్‌గా విషెస్ చెప్పారు చరణ్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు చేస్తున్న గొప్ప పనికి ఇలాగే మరెన్నో అవార్డులు అందుకోవాలి అని అన్నారు. అందుకు ఉపాసన.. థ్యాంక్స్ మిస్టర్ సి. నీ ప్రేమ, సపోర్ట్ లేకుండా ఇవి సాధించేదాన్ని కాదు అని రిప్లై ఇచ్చారు.

TV5 News

Next Post

'అప్పుడే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా'

Sat Oct 5 , 2019
నెల్లూరు జిల్లా వెంకటాచలం MPDO సరళపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ట్విట్టర్‌తో తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్న ఓ మహిళా అధికారిణిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. తనకు న్యాయం చేయాలని అర్థరాత్రి ఆ మహిళా అధికారి స్టేషన్‌కు వెళ్తే కేసు తీసుకోవడానికే జంకుతారేంటని ప్రశ్నించారు బాబు. ఈ రాష్ట్రంలో పోలీసింగ్‌ ఉన్నట్టా లేనట్టా అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు. […]