అమెరికా-భారత్ మధ్య రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందం

modi-and-trump

భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. ఇండియన్ నేవీ కోసం భారత ప్రభుత్వం అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. తాజాగా అమెరికా-భారత్ మధ్య 7 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదిరింది. డీల్ ప్రకారం 13-MK-45-5 ఇంచ్/62 కేలిబర్ నావెల్ గన్స్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ కూడా అనుమతి ఇచ్చింది.

అమెరికాకు చెందిన బీఏఈ సిస్టమ్స్ 13-MK-45 నావెల్ గన్స్‌ తయారు చేస్తోంది. ఈ నావెల్ గన్స్‌తో శత్రువుల ఆయుధ వ్యవస్థ నుంచి రక్షణ లభిస్తుంది. యాంటీ స‌ర్ఫేస్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ మిష‌న్స్ స‌మ‌యంలో ఎంకే-45 గ‌న్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డతాయి. ఈ డీల్‌తో భారత నౌకాదళంలోకి కొత్త అస్త్రాలు చేరనున్నాయి. అలాగే, అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశంలో భారతదేశం మారనుంది.

TV5 News

Next Post

జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు: సుజనా చౌదరి

Thu Nov 21 , 2019
వైసీపీ ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జెరూసలేం వెళ్లేందుకు.. ఆర్థిక సాయం పెంచిన జగన్.. బద్రినాథ్, కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు సాయం చేయాలని.. హిందువులు కోరితే ఏం చేస్తారని నిలదీశారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు, ఓట్ల మూడ్ లోంచి బయటకు వచ్చి పాలనపై […]