గన్, లిక్కర్ బాటిల్‌తో ఐటెం సాంగ్స్‌కు చిందులేసిన ఎమ్మెల్యే..

ఓ చేతిలో గన్.. మరో చేతిలో లిక్కర్ బాటిల్.. అనుచరులతో కలసి బాలీవుడ్ పాటలకు చిందులు.. ఓ ప్రజాప్రతినిధి యవ్వారం ఇది. సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ సీన్ ఉత్తరాఖండ్‌లో కనిపించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్యే, తాను ప్రజాప్రతినిధిని అన్న విషయం కూడా మరిచిపో యి యథేచ్చగా జల్సా చేశాడు. గన్, లిక్కర్ బాటిల్‌తో రౌడీలా బిహేవ్ చేశాడు.

ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్‌సింగ్ చాంపియన్‌ నిర్వాకం ఇది. ఇప్పటికే చాలా వివాదాలు మూటగ ట్టుకున్న ప్రణవ్, తాజాగా మద్యం సేవిస్తూ, తుపాకీతో హల్ చల్ చే శాడు. అనుచరులతో కలిసి ఐటెం సాంగ్స్‌కు చిందులేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రణవ్‌సింగ్‌పై విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.

ప్రణవ్ సింగ్‌ను బీజేపీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఓ జర్నలిస్టును ప్రణవ్ బెదిరించడంతో అతన్ని పార్టీ నుంచి తొలగించింది. క్రమశిక్షణ ఉల్లంఘన, అసభ్య ప్రవర్తన తదితర కారణాలతో అతనిపై వేటు వేసింది. ఐనప్పటికీ ప్రణవ్ సింగ్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మోదీ ఆదేశం.. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీల పాదయాత్ర..

Wed Jul 10 , 2019
పాదయాత్రల ట్రెండ్ బీజేపీని తాకింది. బీజేపీ ఎంపీలు త్వరలో పాదయాత్ర చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేపట్ట నున్నారు. ఒక్కో ఎంపీ దాదాపు 150 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నారు. ఎంపీల పాదయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే లు, ఇతర నాయకులు పాల్గొననున్నారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. ఈసారి బాపూజీ 150వ జయంతి వేడుకలు నిర్వహించను న్నారు. […]