వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలపై టీడీపీ నేతల ఆగ్రహం

vamsi-tdp

వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు టీడీపీ నేత దేవినేని ఉమా. తమను తిట్టడానికి 150 మంది ఎమ్మెల్యేలు చాలదా అని జగన్‌ను ప్రశ్నించారు.

అటు టీడీపీ నేత బోడే ప్రసాద్‌ కూడా వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై వంశీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడన్న వంశీ ఆరోపణలను ఖండిస్తున్నానని తెలిపారు బోడే ప్రసాద్.

TV5 News

Next Post

రైల్లో ఓ వ్యక్తిపై పలువురి దాడి.. పాత గొడవలే కారణం?

Sat Nov 16 , 2019
  అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న సుధాకర్‌ అనే ప్రయాణికుడిపై కొందరు దాడి చేశారు. కాలసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో వ్యక్తులు దాడిచేశాక.. స్లోగా వెళుతున్న రైల్లోంచి సుధాకర్‌ దూకాడు. అయినా వెంబడించి కత్తితో గొంతు కోశారు దుండగులు. స్థానికులు గమనించడంతో… దాడిచేసినవాళ్లు పారిపోయారు. సుధాకర్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ మండలం పాలంవాండ్లపల్లికి చెందిన […]