సంచలనం సృష్టించిన వర్షిణి హత్యకేసు చేధించిన పోలీసులు

BABY

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వర్షిణి హత్యకేసును చిత్తూరు జిల్లా పోలీసులు చేధించారు. నిందితుడు బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీగా గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు రఫీని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రులతో కలిసి కురబాల కోటలో ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల వర్షిణి దారుణ హత్యకు గురైంది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్యాణమండపంలో సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి వర్షిని అర్థరాత్రి సమయానికి కనిపించకుండా పోయింది. తెల్లవార్లూ వెతికినా అమె ఆచూకీ దొరకలేదు. ఉదయం కళ్యాణమండపం సమీపంలోనే వర్షిని విగతజీవిగా పడి ఉంది.

TV5 News

Next Post

ప్రేమ విఫలమైందని ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

Sat Nov 16 , 2019
నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమై ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాష్‌రావు అనే విద్యార్థి.. హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఓ మైనర్ బాలికను ప్రకాష్‌ ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు ప్రకాష్‌ను బెదిరించారు. పేరెంట్స్‌కు కూడా ఫిర్యాదు […]