డెడ్‌బాడీ సిద్ధార్థదేనని ఎలా గుర్తించారంటే..

డెడ్‌బాడీ సిద్ధార్థదేనని ఎలా గుర్తించారంటే..

కెఫే కాఫీ డే అధినేత విజి సిద్దార్థ మిస్సయ్యారన్న వార్తలు కలకలం రేపాయి. ఆత్మహత్య చేసుకుని ఉంటారన్న అనుమానాలకు తెరదించుతూ నేత్రావతి నదిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు 200 మంది సిబ్బంది. నిన్న ఉదయం నదిలో దూకి ఉంటారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు బాడీని బయటకు తీశారు. ఆయనకు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయేమోనని వెతికితే ప్యాంట్ జేబులో పాత నోకియా మొబైల్ దొరికింది. ఆఫోన్‌ను ఆయన చాలా రోజుల నుంచి వాడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు సిద్దార్థ మృతదేహాన్ని గుర్తించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. సిద్దార్థ నదిలో దూకారని చెబుతున్న బ్రిడ్జికి ఆయన మృతదేహం లభ్యమైన ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుందని జాలరి రితేష్ చెప్పారు. ములిహిత్లు ఐలాండ్ సమీపంలో సిద్ధార్థ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళూరులోని వెన్‌లాక్ హాస్పిటల్స్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం చిక్‌మంగళూరుకు సిద్ధార్థ మృతదేహాన్ని తరలిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story