6-11 తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’.. అప్లైకి ఆఖరు..

దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది. ప్రతియేటా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు www.vvm.org.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబర్ 4 లేదా 30 వ తేదీల్లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. డిసెంబర్ 15న ఫలితాలు వెలువడతాయి. విద్యార్థులకు ఆరో తరగతి నుంచే సైన్స్, లెక్కల పట్ల ఆసక్తి కలిగిస్తే ఉన్నత చదువుల్లో రాణించి దేశ పురోగతికి పాటుపడుతారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్ష రాయదలచుకుంటే ఉపాధ్యాయుల సాయంతో వెబ్‌సైట్‌లో సిలబస్ సహా అన్ని వివరాలను తెలుసుకోవాలి. ఈ పోటీ పరీక్షలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన సూచనలు, సలహాలు చేయాలి. ‘విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన’ మంథన్ పోటీ పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారత జాతీయ జెండాలను ధ్వంసం చేసిన పాకిస్తానీయులు

Mon Aug 19 , 2019
ఆగస్టు 15 సందర్భంగా లండన్‌ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రగిలిపోతున్న పాకిస్తానీయులు తమ అక్కసును విదేశాల్లో కూడా చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియా ఎంబసీ వద్ద నిరసనకు దిగారు. స్వాతంత్ర వేడుకులు జరుపుకుంటున్నభారతీయులపై దాడులకు తెగబడ్డారు. భారత హైకమిషన్ కార్యాలయం బయట భారతీయులు స్వాతంత్ర దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్నారు. అయితే పాకిస్తానీయులు వేలాది […]