డియర్ కామ్రెడ్: ట్విట్టర్ రివ్యూ

గీత గోవిందంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక, విజయ్‌లు మరోసారి ప్రేక్షకులను అలరించారనే చెప్పాలి. దర్శకుడు భరత్ కమ్మకి ఇది మొదటి చిత్రమే అయినా ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతంగా ఉండడంతో ఒకరకంగా ప్రేక్షకులు ఈ చిత్రం రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలై డియర్ కామ్రెడ్‌పై అంచనాలు పెంచేసింది. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది కానీ, సెకాండ్ కొద్దిగా సాగదీసినట్లు అనిపించిందని ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ‘కడలల్లే’ పాట సంగీత ప్రియుల్ని మెస్మరైజ్ చేసింది. ఓవరాల్‌గా విజయ్ రష్మిక నటన ముందు చిన్న చిన్న పొరపాట్లు పెద్దగా కనిపించవని అంటున్నారు. కథాపరంగా రొటీన్ సినిమాలా కాకుండా కొత్తదనంతో తీసిన దర్శకుడి ప్రయత్నం అభినందించదగ్గదని అంటున్నారు. దీనికి తోడు కామ్రెడ్ అన్న పదానికి కొత్త నిర్వచనం చెబుతూ చేసిన సినిమా ప్రేక్షకులు చూస్తున్నారు.

 

 

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

విదేశాల్లోనూ ట్రిపుల్ తలాఖ్ వివాదం

Fri Jul 26 , 2019
ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం విదేశాల్లోనూ వివాదం రేపుతోంది. మలేషియా మాజీ రాజు సుల్తాన్ మహ్మద్, తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ ద్వారా విడాకులు ఇచ్చారనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఎంఎస్‌ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు సుల్తాన్ అహ్మద్ విడాకులు ఇచ్చారని, ట్రిపుల్ తలాఖ్ పద్దతిలో డైవోర్స్ చెప్పా రని రాజు తరఫు లాయర్ వెల్లడించారు. జూన్ 22నే ఈ వ్యవహారం జరిగిపోయిందని వివరించారు. సుల్తాన్ మహ్మద్ కారణంగా ఆక్సానాకు […]