ఏపీలో బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

jailu-siksha

విజయవాడ పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. 2017 డిసెంబర్‌లో అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరు నుంచి తల్లితో కలసి బాధిత బాలిక ఇబ్రహీంపట్నానికి వచ్చింది. అయితే బాలిక బంధువైన సైకం కృష్ణారావు ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుపై కేసునమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు.. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు కృష్ణారావుకు 20 సంవత్సరాల కఠినకారాగా శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

TV5 News

Next Post

దిశ హత్యకేసు నిందితుల్లో కనిపించని మార్పు

Mon Dec 2 , 2019
దిశ.. దిశ.. ఈ పేరు అందరితో కన్నీరు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆమెకు మద్దతుగా జనం ముందుకు కదులుతున్నారు.. అతి దారుణంగా అత్యాచారం చేసి.. తరువాత హత్య చేసిన ఆ నలుగురు నిందితులను ప్రజాక్షేత్రంలో ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తున్నారు.. తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని షూట్‌ చేయాలని దిశ తండ్రి డిమాండ్‌ చేశారు. కూతురి అస్తికలను జోగులాంబ గద్వాల్‌ జిల్లా బీచుపల్లి […]